News December 1, 2025
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: CBN

AP: రేపు నిర్వహించే పింఛను పంపిణీ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అందరికీ చేరవేయాలని టెలి కాన్ఫరెన్స్‌లో సూచించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తామని, ప్రతీ అర్హుడైన పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత పాలకుల విధ్వంసంపై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలన్నారు.
Similar News
News December 3, 2025
చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా?

చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని USకు చెందిన NIH (National Institutes of Health) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 10,000 మందికి పైగా పిల్లలపై స్టడీ చేయగా.. 12 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఫోన్‌కు అలవాటు పడిన వారిలో డిప్రెషన్, నిద్రలేమి, ఒబేసిటీ, అలసట వంటి సమస్యలు పెరిగినట్లు గుర్తించింది. ఫోన్‌లో ఏం చేస్తారన్నది కాదని.. అది కలిగి ఉండటమే ప్రమాదకరమని హెచ్చరించింది.
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్‌మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్‌సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్‌లో అమ్మే ప్రతి ఫోన్‌లో ఆ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.


