News December 1, 2025

NLG: సర్పంచ్ అభ్యర్థి భర్తపై దాడి.. మల్లన్న పరామర్శ

image

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి భర్త మామిడి యాదగిరిపై జరిగిన దాడి కలకలం సృష్టించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎస్పీతో కేసు వివరాలు తెలుసుకొని.. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 24, 2026

మంచిర్యాల: ‘గురుకుల ఫలితాల్లో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్’

image

గురుకుల ఫలితాల్లో జన్నారం మండలం అక్కపల్లెగూడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 22 మంది ప్రవేశాలకు అర్హత సాధించారని MEO విజయ్ కుమార్, హెచ్ఎం జాజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఉపాధ్యాయులు మిఠాయిలు తినిపించి అభినందించారు. 22మంది ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రంలోనే ఈ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని వారు వెల్లడించారు.

News March 24, 2026

బాధితులకు తక్షణ న్యాయం అందించాలి: ఎస్పీ

image

బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, మెరుగైన సేవలందించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. మంగళవారం ఆయన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించరాదని, గంజాయి,అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణ పెంచి శాంతిభద్రతలకు కృషి చేయాలని అన్నారు.

News March 24, 2026

ఎస్సీ అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్

image

ఖమ్మం: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఎస్సీ రైతులకు పథకాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, రాబోయే ఏడాదిలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.