News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
Similar News
News March 14, 2026
RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 13, 2026
తూ.గో జిల్లాలో నిరంతరాయంగా LPG సరఫరా

ఏపీ ప్రభుత్వం గృహ అవసరాలు & అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు LPG పంపిణీదారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్, కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.
News March 13, 2026
రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


