News December 1, 2025
పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.
Similar News
News March 14, 2026
విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
News March 13, 2026
వివాదాస్పద ఖర్చుల చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్(2/2)

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం రాళ్లు తరలింపు, యోగాంధ్ర కార్యక్రమంలో వినియోగించిన వీఐపీ మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు జీవీఎంసీ సమావేశంలో అంగీకరించారు. కూర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే పార్కుకు నీటి సరఫరా పైపులకు రూ.46.60 లక్షలు, ట్యాంకర్ల బిల్లులకు రూ.19.20 లక్షలు, ఫాగింగ్‌కు రూ.80 లక్షలు, వీధి కుక్కల శస్త్రచికిత్సలకు రూ.45 లక్షల చెల్లించెందుకు ఆమోదం తెలిపారు.
News March 13, 2026
జీవీఎంసీ చివరి సమావేశం.. వివాదస్పద నిర్ణయాలకు ఆమోదం(1/2)

జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన అజెండాలోని 193 అంశాలతో పాటు టేబుల్ అజెండా కలిపి మొత్తం 294 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 293 అంశాలను సభ్యులు ఆమోదించారు. గతంలో వివాదాస్పదంగా మారి వాయిదా పడిన ప్రతిపాదనలకూ స్వల్ప చర్చతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు రోజుల్లో పాలకవర్గ గడువు ముగియనున్న నేపథ్యంలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలనూ అడ్డుకోకుండా ఆమోదించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


