News December 1, 2025
కొండగట్టు ఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఆదివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి రూ.5,000 తక్షణ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు ఆహారం, వస్త్రాలు అందించాలని, ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎమ్మార్వో, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 21, 2026
పిట్లం: షీర్ ఖుర్మా.. పాలకు డిమాండ్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా పిట్లంలో పాల ధరలు పెరిగాయి. పండుగ ప్రత్యేక వంటకమైన ‘షీర్ ఖుర్మా’ తయారీకి పాలు ప్రధానం కావడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో కంటే అదనపు అవసరం ఉండటంతో పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో లీటర్ పాల ధర ఎంత ఉందో? కామెంట్ రూపంలో తెలియజేయండి.
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గుంటూరు: CRDA కమిషనర్‌గా విజయరామరాజు

CRDA కమిషనర్‌గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కమిషనర్‌గా పనిచేసిన కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. కాగా CRDA కమిషనర్‌గా విజయరామరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో CRDA కమిషనర్లుగా చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు, కన్నబాబు (ప్రస్తుతం) పనిచేశారు.


