News December 1, 2025

KNR: ఓటర్లను ఆకర్షిస్తున్న ఆశావహులు.. సిటీలోని జాబర్స్‌కు ఫోన్ కాల్స్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం జోరు అందుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గ్రామంలోని ఓటర్లు ఉద్యోగం, వ్యాపారం రీత్యా నగరాల్లో ఉండటంతో, అభ్యర్థులు వారికి ఫోన్ కాల్స్ చేసి తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. మరోవైపు గ్రామంలో కూడా ఆశావహులు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 22, 2026

HYDలో నేటి నుంచి బంద్

image

నగరవాసులను నెలరోజులుగా ఆకట్టుకున్న నైట్ బజార్ నేటి నుంచి ఉండదిక. శనివారం పాతబస్తీలో అక్కడక్కడా కనిపించినా నేటి నుంచి 24Hrs షాపింగ్‌కు తెరపడనుంది. లాడ్ బజార్‌లో గాజులు, చార్మినార్ ముందు అత్తరు, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ కోసం నైట్ బజార్‌కు పోటెత్తారు. మొహబ్బత్ కా షర్బత్, కబాబ్స్, పత్తర్ కా ఘోష్ బాగా సేల్ అయ్యాయని నిర్వాహకులు చెబుతుతున్నారు. గ్యాస్ కొరత ఉన్నా.. హలీం,బిర్యానీ సప్లై తగ్గలేదని ఫుడీస్ మాట.

News March 22, 2026

పూతలపట్టు: ఉదయాన్నే ఘోర ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

image

పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుమలకు వెళ్తున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కారు లారీని ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2026

WGL: రేపు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం!

image

రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 6 లక్షల మంది రైతులకు భరోసా నిధులు రానున్నాయి. తొలి విడతలో భాగంగా ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున సోమవారం జమ కానున్నాయి. మరో 20 రోజుల తర్వాత 2 విడత, ఏప్రిల్ చివరి వారంలో 3వ విడత కింద భరోసా నిధుల విడుదల కానున్నాయి. ఒక్కో జిల్లాకు రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు నిధులు రానున్నాయి