News December 1, 2025

భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 19, 2026

ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.

News March 19, 2026

భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

image

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

News March 19, 2026

తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

image

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.