News December 1, 2025

KNR: ఓటర్లను ఆకర్షిస్తున్న ఆశావహులు.. సిటీలోని జాబర్స్‌కు ఫోన్ కాల్స్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం జోరు అందుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గ్రామంలోని ఓటర్లు ఉద్యోగం, వ్యాపారం రీత్యా నగరాల్లో ఉండటంతో, అభ్యర్థులు వారికి ఫోన్ కాల్స్ చేసి తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. మరోవైపు గ్రామంలో కూడా ఆశావహులు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News March 8, 2026

T20 WC: ‘ఫైనల్’ పంచ్ ఎవరిది?.. జట్టులో మార్పులు ఉంటాయా?

image

T20 WC ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ రా.7 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి. సొంత గడ్డపై WC గెలిచి చరిత్ర సృష్టించాలని ఇండియా, ఈసారైనా కప్ గెలవాలని కివీస్ పట్టుదలతో ఉన్నాయి. అభిషేక్, వరుణ్ స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్‌ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా మార్పుల్లేకుండానే IND బరిలోకి దిగే అవకాశముంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News March 8, 2026

మరో స్టార్ హీరోతో నయనతార నయా ప్రాజెక్ట్!

image

ఏజ్ పెరుగుతున్నా నయనతార క్రేజ్ తగ్గట్లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కి తగ్గట్లు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. షారుఖ్‌ఖాన్‌తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News March 8, 2026

నిర్మల్: ‘ప్రజాపాలన’లో 341 ఫైళ్ల పరిష్కారం..!

image

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య, ఫైళ్ల పరిష్కార డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏకంగా 48,673 కిలోల ఘన వ్యర్థాలను అధికారులు తొలగించారు. 1,044 ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా, పరిపాలనను వేగవంతం చేస్తూ పెండింగ్‌లో ఉన్న 341 ఫైళ్లను ఒకేరోజు పరిష్కరించారు.