News December 1, 2025
నేడు నూజివీడులో PGRS కార్యక్రమం

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రజల అర్జీలు ఆన్‌లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు.
Similar News
News March 24, 2026
రంగయ్య పోరాటంతోనే ఆర్డీటీకి గుడ్‌న్యూస్: YCP

మాజీ ఎంపీ తలారి రంగయ్య అవిశ్రాంత పోరాటంతోనే RDT సంస్థకు FCRA అనుమతులు మంజూరయ్యాయని YCP పేర్కొంది. ‘ఢిల్లీలో ఆయన చేసిన నిరసనలు, హోంమంత్రి అమిత్ షాను కలిసి జిల్లా ప్రజల కష్టాలను వివరించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. దీని వెనుక తలారి రంగయ్య మొక్కవోని దీక్ష, కంటతడి పెట్టించే కృషి దాగి ఉంది. కానీ.. ఆ ఘనతను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని విమర్శిస్తూ ట్వీట్ చేసింది.
News March 24, 2026
క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు: SC

SCల మతమార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే SC హక్కులు పొందుతారని పేర్కొంది. ‘కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు’ అని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో AP హైకోర్టు తీర్పును సమర్థించింది.
News March 24, 2026
అమలాపురంలో 27న జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం 8978905032 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.


