News December 1, 2025
నరసరావుపేట: ‘మీ కోసం’ సేవలు.. కలెక్టర్ విజ్ఞప్తి

నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.
Similar News
News March 10, 2026
ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
News March 10, 2026
రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
బాపట్ల ‘పుర’ అధికారులు నియామకం

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కుమార్ జీఓ విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, చీరాల పురపాలక సంఘ అధికారులకు గ్రేడ్-2 అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. రేపల్లెకు రేపల్లె ఆర్డీఓ, చీరాల పురపాలక సంఘానికి చీరాల ఆర్డీఓ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.


