News December 1, 2025
నేడు అమలాపురంలో యథావిధిగా PGRS: కలెక్టర్

అమలాపురంలోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా వేదిక నిర్వహిస్తామన్నారు. స్వీకరించిన అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 16, 2026
వికారాబాద్: రూ.లక్ష వాహనంపై 90% సబ్సిడీ!

వికారాబాద్ జిల్లాలోని SC సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ప్రభుత్వం “ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26” కింద భారీ సబ్సిడీతో కూడిన రుణాలను ప్రకటించింది. రూ.లక్ష విలువైన ఎలక్ట్రికల్ బైక్‌లపై 90% సబ్సిడీ, రూ.3 లక్షల విలువైన ఎలక్ట్రికల్ ఆటోలపై (ప్యాసింజర్/గూడ్స్) 70% సబ్సిడీ, రూ. 3 నుంచి రూ. 7 లక్షల విలువ గల సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ పరికరాల యూనిట్లపై 60% వరకు సబ్సిడీ లభిస్తుంది.
News March 16, 2026
HYDలోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

TG: హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలోకి జిల్లాల నుంచి డీజిల్ బస్సులు రాకుండా కట్టడి చేయనుంది. ORR చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయనుంది. HYDలోని డీజిల్ బస్సులనూ జిల్లాలకు తరలించి ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే వాడతామని ఇటీవల సీఎం <<19328203>>రేవంత్<<>> చెప్పిన విషయం తెలిసిందే.
News March 16, 2026
శ్రీకాకుళం: పది పబ్లిక్ పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

జిల్లాలో నేడు ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు ముందే OMR షీట్ పై ఫోటో, పేరు, రోల్ నంబర్ సరిచూసుకోవాలి. విద్యార్థులకు 24 పేజీల మెయిన్ బుక్లెట్, అవసరమైతే 12 పేజీల అదనపు బుక్లెట్ అందిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులను కచ్చితంగా నిషేధించారు.


