News December 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులు Dy.CM పర్యటన

image

Dy.CM మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మంలో జరిగే నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధిరలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటనలో వివరించారు.

Similar News

News March 27, 2026

విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తాం: నారా భువనేశ్వరి

image

త్వరలోనే విజయవాడలో తలసేమియా సెంటర్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం (చిత్తూరు)లో పర్యటించిన ఆమె దీనిపై ప్రకటన విడుదల చేశారు. విజయవాడతో పాటు అనంతపురంలో ప్రారంభించే తలసేమియా సెంటర్ నిర్వహణ బాధ్యతను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చూసుకుంటుందన్నారు. విజయవాడలో తలసేమియా సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు.

News March 27, 2026

VJA: ఉగ్రవాద కేసులో కీలక మలుపు!

image

ఉగ్రవాద కార్యకలాపాల కేసు దర్యాప్తులో కొత్తపేట పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు CI కొండలరావు తెలిపారు. పట్టుబడిన వారిలో లక్కీ అహ్మద్, అజ్ముల్లా ఖాన్, అబ్దుల్ మజీద్, ఆసిఫ్ అలీ, షారుక్ ఖాన్, రెహమాన్ ఉన్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా అరెస్టులతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

News March 27, 2026

వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ.. మళ్లీ అదే కాంబినేషన్

image

వెంకీ-కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి తీస్తున్న కొత్త మూవీకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు హీరోలతో ఉన్న ఫొటోలను అనిల్ రిలీజ్ చేశారు. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్, Z స్టూడియోస్ భాగం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో కీర్తీ సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నా మూవీ టీమ్ ప్రకటించలేదు. ఇక సాహు-అనిల్ కాంబోలో భగవంత్ కేసరి, MSVPG మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.