News December 1, 2025

MDK: తహశీల్దార్ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, మైక్‌లకు తహశీల్దార్ అనుమతి తప్పనిసరన్నారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సభలు, ఊరేగింపులు నిషేధమని, లౌడ్‌స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమేన్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఒక్క వాహనం అనుమతి ఉందన్నారు.

Similar News

News March 27, 2026

MDK: శ్రీరామనవమి.. ఎస్పీ ప్రత్యేక పూజలు

image

శ్రీరామనవమి సందర్భంగా మెదక్ టౌన్‌లోని శ్రీ రామాలయంలో జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఎస్పీ జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. శాంతిభద్రతల కోసం పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేష్, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

News March 27, 2026

ఇంధన కొరతపై వదంతులు నమ్మొద్దు: కలెక్టర్

image

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉందని, బుకింగ్ చేసిన వారికి 100% డెలివరీ జరుగుతోందన్నారు. అవసరానికి మించి నిల్వలు వద్దని సూచించారు. అక్రమ వినియోగంపై తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లు సీజ్ చేసి 23 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని, సమస్యల కోసం 9391942254 సంప్రదించాలని సూచించారు.

News March 27, 2026

మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.