News December 1, 2025
సిద్దిపేట: సప్లమెంటరీ నోటిఫికేషన్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ స్టడీ పీజీ సెకండియర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు స్పెల్ 2 సప్లమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరుగుతాయని, విద్యార్థులు ఫీజును డిసెంబర్ 22లోపు www.braouonline.in ఆన్లైన్లో చెల్లించాలని సిద్దిపేట రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు.
Similar News
News March 22, 2026
కారంచేడులో మరో వ్యక్తి మృతి

కారంచేడు–చీరాల రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చీరాల నుంచి కారంచేడు వైపు బైక్‌పై వస్తున్న శ్రీనివాసరావును ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రోజు కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ముగ్గురు మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది.
News March 22, 2026
యుద్ధంతో అమెరికాకు ₹2.5లక్షల కోట్ల ఖర్చు

ఇరాన్‌పై యుద్ధంలో తగ్గేదే లేదని గాంభీర్యం ప్రదర్శిస్తున్న అమెరికాకు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఈ యుద్ధం కోసం 21 రోజుల్లో $27 బిలియన్లు (₹2.5లక్షల కోట్లు) ఖర్చు చేసింది. పైగా మరో $200 బిలియన్లకు ట్రంప్ పార్లమెంటులో రిక్వెస్ట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే USకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఇప్పటికే US అప్పు 39 ట్రిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.
News March 22, 2026
‘వాట్సాప్’ల్లోనే అమ్మాయిల వివరాలు: నెల్లూరు ASP

నెల్లూరులో <<19448814>>వ్యభిచార<<>> ఘటనపై ASP దీక్ష మాట్లాడారు. ‘గతవారమే మాకు సమాచారం వచ్చింది. చిన్నబజార్‌లోని నాలుగు లాడ్జిల్లో సోదాలు చేశాం. లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD, బెంగళూరు నుంచి రప్పించి వారి ఫొటో, రేట్ నిర్ణయించి కస్టమర్‌కు వాట్సాప్ చేస్తారు. దీంతో ఇవాళ మా టీమ్‌తో దాడులు చేశాం. ఓ అమ్మాయితో నలుగురు విద్యార్థులు ఉండగా పట్టుకున్నాం. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేశాం. కేసు నమోదు చేస్తాం’ అని ASP తెలిపారు.


