News December 1, 2025

తుఫాను నేపథ్యంలో తిరుపతి ఎస్పీ భద్రత సూచనలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అరణియార్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 1.6 TMCకు చేరుకోవడంతో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్దకు వెళ్లరాదని, ప్రవాహ ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 8099999977 లేదా 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

Similar News

News March 25, 2026

GNT: రేపు పోలీస్ కండెమినేషన్ వస్తువుల బహిరంగ వేలం

image

గుంటూరు (D) పోలీస్ శాఖకు చెందిన పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనున్నారు. SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 4 గ. RI స్టోర్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాత టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు, వివిధ రకాల వస్తువులను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

News March 25, 2026

నెల్లూరు: పేరుకే నగర పంచాయతీలు..!

image

బుచ్చి, అల్లూరుకు జనాభాను చూసి నగర పంచాయతీల హోదా ఇచ్చారు. కానీ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమే. ప్రజల నుంచి ఆస్తి, కొళాయి పన్నులను వసూలు చేస్తున్నా నగర ప్రాంతానికి ఉండాల్సిన హంగులు లేవు. కనీసం డివైడర్ల రూపు రేఖలు మారడం లేదు. ఎక్కడ చూసినా మురుగు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. బుచ్చిలో 42 వేలు, అల్లూరులో 35 వేలకు పైగా జనాభా ఉన్నా వసతులు లేవు. పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.

News March 25, 2026

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు: VZM SP

image

పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడు వై.సత్యనారాయణకు జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పద్మావతి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. భార్యపై అనుమానంతో పామ్ ఆయిల్ తోట వద్ద హత్య చేసినట్లు కేసు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.