News December 1, 2025
ములుగు: ఈసారి PLGA వారోత్సవాలు లేనట్లే!

ప్రతియేటా డిసెంబర్ 2 నుంచి నిర్వహించనున్న నక్సల్స్ పీఎల్‌జీఏ వారోత్సవాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. మావోయిస్టుల లొంగుబాటు, మరోవైపు అగ్రనేతలు ఎన్కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఇటీవల మావోయిస్టు నేత అనంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 23, 2026
హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.
News March 23, 2026
వెదురుకుప్పం: జల్లికట్టులో విషాదం.. 3 ఎద్దులు మృతి

వెదురుకుప్పం మండలంలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మూడు ఎద్దులు చెరువులో పడి మృతిచెందాయి. వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో ఆదివారం జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. జల్లికట్టు చూసేందుకు సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున రావడం, డప్పు వాయిద్యాలకు జల్లికట్టులో బెదిరిన ఎద్దులు చెరువులో దూకడంతో మృతి చెందాయి. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఎద్దులు మృతి చెందడంతో రైతులు విలపిస్తున్నారు.
News March 23, 2026
మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.


