News December 1, 2025

నేడు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో డిసెంబర్ 1న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నామని కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 7, 2026

బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

image

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖ‌ను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.

News March 7, 2026

విద్యుత్ సరఫరాకు ఆటంకం లేదు: సీఎండీ వరుణ్ రెడ్డి

image

NPDCL పరిధిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు CMD వరుణ్ రెడ్డి తెలిపారు. సంస్థ పరిధిలోని 70.23 లక్షల సర్వీసులకు పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. ఈ నెలలో అత్యధికంగా 6,441 మెగావాట్ల డిమాండ్ నమోదైనప్పటికీ, ఎక్కడా అంతరాయం లేకుండా సరఫరా చేశామని వివరించారు. నెట్‌వర్క్‌లో 400 కేవీ నుంచి 33 కేవీ వరకు వేల సంఖ్యలో సబ్‌స్టేషన్లు ఉన్నాయన్నారు.

News March 7, 2026

తూ.గో: స్టూడెంట్స్‌తో మీనాక్షి చౌదరి డాన్స్

image

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో జరుగుతున్న మైత్రి యువజనోత్సవాలలో శుక్రవారం రాత్రి నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలు పాడి డాన్స్ చేశారు. తాను దంతవైద్యం చదివి నటినయ్యానని.. విద్యార్థుల ఆనందం చూస్తుంటే తన చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షిని చాన్స్‌లర్ చైతన్య రాజు సత్కరించారు. భవిష్యత్తులో మీలోనే ఎందరో నటీనటులు రావచ్చని ఆమె ఆకాంక్షించారు.