News December 1, 2025

విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు రంగం సిద్ధం

image

విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 5 నుంచి 15 వరకు 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం పోటీలు జరిగే వుడా పార్క్, శివాజీ పార్క్, కైలాసగిరి, బోయపాలెం వేదికలను పరిశీలించారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. స్పీడ్, హాకీ, ఆల్ఫైన్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 15, 2026

ధురంధర్-3కి డైరెక్టర్ ప్లాన్?

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో సెకండ్ పార్ట్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పార్ట్-3కి కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 19 ‘ధురంధర్-ది రివెంజ్’ విడుదలయ్యాక ప్రేక్షకుల రెస్పాన్స్‌ను బట్టి ముందుకెళ్లే అవకాశం ఉందని టాక్.

News March 15, 2026

పార్వతీపురం: మంటల్లో సజీవ దహనం

image

మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురంలోని పాత రెల్లి వీధిలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మంటలు అంటుకోవడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు బెహరా గొల్ల (55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2026

సూరంపేట: ఆవుపై పులి దాడి

image

కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లో ఆవును పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. పులి కథలాపూర్ మండలం తుర్తి అటవీ ప్రాంతం నుంచి కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లోకి వెళ్లినట్టు పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూరంపేట అడవిలో పులి ఆవును చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు.