News December 1, 2025

విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు రంగం సిద్ధం

image

విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 5 నుంచి 15 వరకు 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం పోటీలు జరిగే వుడా పార్క్, శివాజీ పార్క్, కైలాసగిరి, బోయపాలెం వేదికలను పరిశీలించారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. స్పీడ్, హాకీ, ఆల్ఫైన్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 8, 2026

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం.. వాస్తవం ఇదే!

image

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం లభ్యం అంటూ SMలో వస్తున్న వార్తలపై FACT CHECK స్పందించింది. ‘తిరుపతి రూరల్ పాడిపేట ఇందిరమ్మ గృహాల వద్ద చంద్రగిరి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగేష్ రెడ్డి(38) నివాసంలో 34 లీటర్ల అనధికార మద్యం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి కెమికల్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు’. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News March 8, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 8, 2026

పోలవరం: అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు చుక్కెదురైంది. ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ల నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.