News December 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 7, 2026

VIRAL: సిస్టర్‌తో సీఎం నితీశ్

image

ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న బిహార్ సీఎం నితీశ్‌ సోదరి సామాన్య జీవనం గడపడం విశేషమే. కుర్చీలో కూర్చుంటే కోట్లు కూడబెట్టే కాలమిది. కానీ 20 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. ఆయన కూడా ఆస్తులు వెనకేసుకోలేదు. నితీశ్ ఆస్తులు రూ.1.66 కోట్లే. హోలీ రోజు తన అక్క ఉషా దేవిని ఆయన కలిసిన ఫొటో వైరలవుతోంది. పీఎం మోదీ, యూపీ సీఎం యోగి కుటుంబీకులు సైతం ఇలాగే నిరాడంబరంగా ఉండటం విశేషం.

News March 7, 2026

భారత్ వద్ద 4వేల కోట్ల లీటర్ల ముడి చమురు!

image

భారత్ వద్ద 25 రోజులకే ఆయిల్ రిజర్వులు ఉన్నాయన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్ల (250 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయిలో 7 – 8 వారాలకు సరిపోతాయని వివరించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులోని భూగర్భ కేంద్రాలు & టెర్మినళ్లలో ఈ నిల్వలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. తప్పుడు వార్తలు నమ్మొద్దంది.

News March 7, 2026

AIతో భారీగా ఉద్యోగాలేమీ పోలేదు: ఆంథ్రోపిక్ రిపోర్ట్

image

ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోలేదని ఆంథ్రోపిక్ వెల్లడించింది. టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్స్‌లో యువ ఉద్యోగుల నియామకాలు తగ్గాయని ఓ నివేదికలో తెలిపింది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలసిస్, రొటీన్ డిజిటల్ డ్యూటీలను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువని చెప్పుకొచ్చింది. మెకానిక్‌లు, వంటవాళ్లు.. ఇలా మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు సమస్య లేదని పేర్కొంది.