News December 1, 2025
దిత్వా తుపాన్.. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దిత్వా’ తుపాన్ ప్రభావం కారణంగా DEC 2 నుంచి 5 వరకు తీవ్ర వర్ష ప్రభావం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Similar News
News March 7, 2026
WGL: సాయి శివానిని అందుకోలేకపోయారు!

గతేడాది సివిల్ సర్వీస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని ఈ ఏడాది ఎవరూ అందుకోలేకపోయారు. 2025 ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి టాప్ ర్యాంకులు రాగా, పెద్దపల్లికి చెందిన అభ్యర్థి సృజనకు 55వ ర్యాంకు వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి తరుణ్ తేజ-123, విక్రమ్-472, అనిశెట్టి-676, ప్రవీణ్-793, భరత్ కుమార్- 900, జితేందర్-939వ ర్యాంకులు సాధించారు.
News March 7, 2026
తిరుపతి SVU విద్యార్థులకు అలర్ట్

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో డిగ్రీ (UG) 4, 6 సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. మార్చి 21వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 7, 2026
జిల్లాలో పదో తరగతి పరీక్షలు..6,949 మంది విద్యార్థులు

ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఆసిఫాబాద్ జిల్లాలో 6,949 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 38 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 500 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్లు (ఇంచార్జీ డీఈఓ) అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు.


