News December 1, 2025
గంభీర్.. ఏం స్ట్రాటజీ ఇది?

చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా SAపై భారత్ తొలి వన్డే గెలిచింది. అయితే IND బ్యాటింగ్ ఆర్డర్, ప్లేయింగ్ 11పై విమర్శలొస్తున్నాయి. పంత్‌ను ఎందుకు తీసుకోలేదు? రుతురాజ్ నం.4 ఏంటి? రాహుల్ కంటే ముందు బ్యాటింగ్‌కు సుందర్ ఎందుకు? అని క్రీడా విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఛేంజెస్ పెద్దగా వర్కౌట్ కాలేదని, గంభీర్ ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదంటున్నారు. దీనిపై మీ COMMENT.
Similar News
News March 14, 2026
సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు: BJP

ప్రపంచంలో ఇంధన సంక్షోభం నెలకొన్నా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని బీజేపీ ట్వీట్ చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ధర $100 దాటినా మోదీ ప్రభుత్వ ముందుచూపుతో దేశంలో రేట్లు పెరగలేదని తెలిపింది. ఇదే సమయంలో G20 దేశాల్లో 20% వరకు ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించింది. దేశంలో 7-8 వారాలకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని, వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోందని వివరించింది.
News March 14, 2026
నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.
News March 14, 2026
NHPCలో 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు

NHPC లిమిటెడ్ 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో BE/BTech/BSE పూర్తి చేసి 60% మార్కులున్న వారు, MAR 16-APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. GATE 2024/GATE 2025 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూతో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.50k- రూ.1.60 లక్షల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు www.nhpcindia.com చూడండి.


