News December 1, 2025
నా పార్ట్‌నర్ హాఫ్ ఇండియన్: మస్క్

నిఖిల్ కామత్ ‘People by WTF’ పాడ్‌కాస్ట్ షోలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భాగస్వామి శివోన్ జిలిస్ హాఫ్ ఇండియన్ అని చెప్పారు. తన సంతానంలో ఓ కుమారుడి పేరులో శేఖర్ అని ఉంటుందని, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ పేరు నుంచి దీనిని తీసుకున్నట్లు వెల్లడించారు. భారత్, US మధ్య సంబంధాలు ఇతర ఆసక్తికర అంశాలను ఆయన పంచుకున్నారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ <
Similar News
News April 2, 2026
ఈ వార్తలూ చదవండి..

⬇ గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!
⬇ క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై
⬇ చిరు ఇంట హనుమాన్‌ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)
⬇ ట్రెడిషనల్ పనికి టెక్నాలజీ తోడు.. ఆనంద్ ప్రశంస
⬇ జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
⬇ సచిన్ స్పెషల్ వీడియో
⬇ ‘రామాయణ’ టీజర్.. రాముడి లుక్ రివీల్!
⬇ VIDEO: ట్రంప్‌ను ఏసుక్రీస్తుతో పోల్చిన పాస్టర్
⬇ KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!
News April 2, 2026
గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!

హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే రిలీజైన పెహల్వాన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా రిలీజైన ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ ఎలా ఉందో COMMENT చేయండి.
News April 2, 2026
ఇలా నవ్వడమూ ఓ జబ్బే..!

కారణం లేకుండా, సంతోషం కలగకున్నా నవ్వే ఓ జబ్బు ఉందని మీకు తెలుసా? ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అనే అరుదైన వ్యాధితో రోగులు ఆపుకోలేనంతగా నవ్వుతూ ఫిట్స్ బారిన పడతారు. ఇటీవల AIIMS జోధ్‌పూర్ ఈ వ్యాధి చికిత్సలో విజయం సాధించింది. ‘మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ’ ద్వారా రోగులకు శాశ్వత పరిష్కారం అందించింది. మెదడులోని ‘హైపోథాలమస్’భాగంలో ఏర్పడే హైపోథాలమిక్ హమార్టోమా అనే చిన్న గడ్డ వల్ల నియంత్రణ లేకుండా నవ్వుతుంటారు.


