News December 1, 2025

DEC 2న సిద్దిపేట IT టవర్‌లో ఉద్యోగ మేళా

image

సిద్దిపేట TASK (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్) ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీ ఉద్యోగ మేళా ఉంటుందని మేనేజర్ నరేందర్ తెలిపారు. ప్రముఖ MNC, కంపెనీ టెలి పెర్ఫామెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. 2023, 2024, 2025లో బీటెక్, బీఈ, ఏని డిసిప్లేన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో జాబ్ చేయాల్సి ఉంటుందన్నారు.

Similar News

News March 8, 2026

కామారెడ్డి: చిన్నారుల మిస్సింగ్.. విషాదాంతం..!

image

కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో అదృశ్యమైన <<19324752>>ముగ్గురు చిన్నారులూ<<>> మృతి చెందారు. అక్కచెల్లెలైన సిపత్ (8), అయాత్ (7), మరియం(5) కామారెడ్డి సమీపంలో విగతజీవులుగా కనిపించారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించగా.. కొద్దిసేపటి క్రితమే సిపత్ డెడ్‌బాడీ లభ్యమయ్యింది. కాగా పోలీసుల అదుపులో చిన్నారుల తండ్రి ఉన్నట్లు సమాచారం.

News March 8, 2026

మహబూబాబాద్: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి: జిల్లా జడ్జి

image

మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీ పడదగ్గ పెండింగ్ కేసులను గుర్తించి, ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. గత లోక్ అదాలత్‌లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా పనిచేయాలన్నారు.

News March 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.