News December 1, 2025
వనపర్తి: 35 ఏళ్లుగా ఉపసర్పంచ్‌గా ఊసిరెడ్డి

అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామానికి చెందిన మోరెడ్డి వంశీయులు 35 ఏళ్లుగా ఉప సర్పంచ్‌గా కొనసాగారు. గ్రామానికి చెందిన మోరెడ్డి ఊసిరెడ్డి 35 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఈసారి వయసు మీద పడడంతో ఆయన పదవికి ఆసక్తి చూపలేదు. 35 ఏళ్లుగా సర్పంచి ఉపసర్పంచ్ పదవికి చుక్క, మోరెడ్డి వంశీలే ఉండడం విశేషం.
Similar News
News March 21, 2026
కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.
News March 21, 2026
భద్రాద్రికి బడ్జెట్ ‘భరోసా’.. బీమా, విద్యార్థులకు వరం

బడ్జెట్‌లో జిల్లాకు ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. రేషన్ కార్డు కలిగిన 3,22,738 కుటుంబాలకు ‘ఇందిరమ్మ జీవిత బీమా’ కింద రూ.5 లక్షల చొప్పున భద్రత కల్పించనున్నారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంటర్ చదువుతున్న 4,300 మందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ATCల్లో శిక్షణ పొందుతున్న 688 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందనుంది.
News March 21, 2026
MBNR: డిగ్రీ పరీక్ష ఫీజుకు వారం గడువు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BSC, BZC, BA) 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 28తో గడువు ముగియనుంది. విద్యార్థులు సకాలంలో కాలేజీ వెబ్‌సైట్లలో ఫీజు చెల్లించి పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు అవకాశం ఉంది.


