News December 1, 2025

సంగారెడ్డి: జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక

image

అండర్-19 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సంగారెడ్డిలోని జూనియర్ కళాశాల విద్యార్థి లెవిన్ మానిత్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన లెవెన్ కళాశాలలో ఘనంగా సన్మానించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2026

నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

image

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.

News March 21, 2026

తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

image

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.

News March 21, 2026

కేయూకు బ్లాక్ గ్రాంట్ పెంపు.. రూ.20 కోట్ల అధిక కేటాయింపు

image

కాకతీయ యూనివర్సిటీకి 2026-27 బడ్జెట్‌లో బ్లాక్ గ్రాంట్ గత ఏడాదితో పోల్చితే సుమారు రూ.20 కోట్లు పెరిగింది. మొత్తం రూ.165.47 కోట్లు వేతనాల కోసం కేటాయించగా, ఇందులో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.129.83 కోట్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.35.64 కోట్లు ఉన్నాయి. ప్రతిపాదనల మేరకు పూర్తిస్థాయి నిధులు రాకపోయినా పెంపుపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం సంతృప్తి వ్యక్తం చేశారు.