News December 1, 2025
ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

AP: దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News March 24, 2026
యుద్ధం.. మోదీకి ట్రంప్ ఫోన్

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా యుద్ధం, రెండు దేశాలపై దాని ప్రభావం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. హార్ముజ్‌లో నౌకలు చిక్కుకోవడం, జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. మరోవైపు యుద్ధం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని మోదీ ఇప్పటికే దేశ <<19465598>>ప్రజలకు<<>> పిలుపునిచ్చారు.
News March 24, 2026
పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్ హాట్ టాపిక్‌గా మారింది. <<-se>>#Elections2026<<>>
News March 24, 2026
పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 2/2

పాలనపై పూర్తి కంట్రోల్ ఉండట్లేదని, ఈసారి NDA కూటమిలో లాట్చియ జననాయగ కట్చి అనే పార్టీ చేరడం AINRC అసంతృప్తికి కారణం. దీనిని కాంగ్రెస్-DMK తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రహోదా డిమాండ్‌ను కూడా ఎన్నికల అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది. విజయ్ TVK 30 సీట్లలోనూ సోలోగా పోటీ చేయనుండటంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఇక NDAలో భాగమైన AIADMK ఇక్కడ ఉనికి కోసం పోరాడుతోంది. <<-se>>#Elections2026<<>>


