News December 1, 2025
‘దిత్వా’.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దిత్వా’ తుఫాన్ ప్రభావం కారణంగా DEC 2 నుంచి 5 వరకు తీవ్ర వర్ష ప్రభావం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Similar News
News March 14, 2026
‘వేటగాడు’ నిర్మాత అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.అర్జునరాజు(80) నిన్న హైదరాబాద్‌లో వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. ఎన్టీఆర్ ‘వేటగాడు’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన ఆయన ‘కొండవీటి సింహం’, ‘జేబుదొంగ’, ‘అడవి సింహాలు’, ‘బావనచ్చాడు’, ‘జాబిల్లి’, ‘మా నాన్నకు పెళ్లి’ వంటి సినిమాలను నిర్మించారు. హిందీలో 6 సినిమాలు చేశారు. ఆయన కుమారుడు రామలింగరాజు కూడా ‘జగపతి’, ‘మా అల్లుడు వెరీగుడ్’ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.
News March 14, 2026
కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ సమయంలో కూరగాయ పంటల్లో నీటి ఎద్దడి నివారణకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మొక్క పెరగడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 5 గ్రా. కలిపి స్ప్రే చేయాలి. టమాట, పుచ్చలలో కాయ పగుళ్లు నివారణకు లీటరు నీటికి బోరాక్స్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.3గ్రా లేదా ఫిప్రోనిల్ 2ML కలిపి పిచికారీ చేయాలి.
News March 14, 2026
అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

AP: అంగన్‌వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్‌నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.


