News December 1, 2025

మహాభారతంలో భాగమే భగవద్గీత

image

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తిలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.

Similar News

News March 14, 2026

‘వేటగాడు’ నిర్మాత అర్జునరాజు కన్నుమూత

image

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.అర్జునరాజు(80) నిన్న హైదరాబాద్‌లో వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. ఎన్టీఆర్ ‘వేటగాడు’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన ఆయన ‘కొండవీటి సింహం’, ‘జేబుదొంగ’, ‘అడవి సింహాలు’, ‘బావనచ్చాడు’, ‘జాబిల్లి’, ‘మా నాన్నకు పెళ్లి’ వంటి సినిమాలను నిర్మించారు. హిందీలో 6 సినిమాలు చేశారు. ఆయన కుమారుడు రామలింగరాజు కూడా ‘జగపతి’, ‘మా అల్లుడు వెరీగుడ్’ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.

News March 14, 2026

కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ సమయంలో కూరగాయ పంటల్లో నీటి ఎద్దడి నివారణకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మొక్క పెరగడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 5 గ్రా. కలిపి స్ప్రే చేయాలి. టమాట, పుచ్చలలో కాయ పగుళ్లు నివారణకు లీటరు నీటికి బోరాక్స్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.3గ్రా లేదా ఫిప్రోనిల్ 2ML కలిపి పిచికారీ చేయాలి.

News March 14, 2026

అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

image

AP: అంగన్‌వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్‌నెస్‌ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.