News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News March 21, 2026

మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత

image

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్‌గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.

News March 20, 2026

ప్రకాశం జిల్లాలో పెట్రోల్ ధరల పెంపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పవర్ పెట్రోల్ ధరల పెంపుతో మరో షాక్ తగిలింది. గిద్దలూరులోని అన్ని బంకుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.35 పెంచి రూ.119.59 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

News March 20, 2026

అందాల పోటీలు.. మార్కాపురం యువతికి కిరీటం

image

మార్కాపురానికి చెందిన శ్రీరంగం నరసింహచార్యులు కుమార్తె దీప్తి ప్రతిభ చూపింది. హైదరాబాద్‌లో మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా-2026 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఫ్యాషన్ షోలో 500 మంది పైగా పాల్గొన్నారు. దీప్తి విజేతగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా రూ.3లక్షల ప్రైజ్ మనీ,కిరీటాన్ని అందుకున్నారు.