News December 1, 2025
NRPT: 15 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆదివారం మొత్తం 15 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కోటకొండలో ఇద్దరు, బొమ్మన్‌పాడులో ముగ్గురు, శాసన్‌పల్లి సర్పంచ్ స్థానానికి నలుగురు నామినేషన్లు వేశారు. మిగిలిన అప్పక్‌పల్లి, అంతర్, జాజాపూర్, షేర్‌నపల్లి, సింగారం, తిరుమలాపూర్ పంచాయతీలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు.
Similar News
News March 13, 2026
ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్‌కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
News March 13, 2026
విజయవాడ: అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లల్లో తనిఖీలు

విజయవాడలోని రౌడీషీటర్లపై పోలీసులు నిరంతర నిఘా పెడుతున్నారు. మాచవరం ప్రాంతంలో సీఐ వెంకటరమణ తన సిబ్బందితో గురువారం అర్ధరాత్రి రౌడీ షీటర్లు, అనుమానితుల గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లు తమ తమ ఇళ్లలోనే ఉన్నట్లు గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు తరచుగా కొనసాగుతాయని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
కామారెడ్డి: రేపటి నుంచే పది పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను పటిష్ఠ భద్రతల మధ్య నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా బాలురు 6,451 బాలికలు 6,703 మంది ఉన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9గం.నుంచి 12.30గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ చూపించి పరీక్షా కేంద్రం దగ్గర్లోకి ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు.


