News December 1, 2025
ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఏలూరు రూరల్ మండలం పెనుమాక లంక గ్రామానికి చెందిన సైదు వెంకన్న (47) మాదేపల్లి గంగానమ్మ గుడి వద్ద శనివారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వెంకన్న కూలి పనిలో వచ్చిన సొమ్ముతో మద్యం తాగి రోడ్డు పక్కనే నిద్రించేవాడు. శనివారం రోడ్డు పక్కనే అతను మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనారోగ్యంతో మృతిచెందాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
Similar News
News March 19, 2026
TODAY HEADLINES

✏ ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
✏ 2029లో BRS ఎలా గెలుస్తుందో చూస్తా: సీఎం రేవంత్
✏ తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు
✏ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు: షర్మిల
✏ డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం
✏ గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
✏ ఐపీఎల్: SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
News March 19, 2026
రాయనపాడు వాగన్ వర్క్‌షాప్‌లో స్వర్ణోత్సవాలు

రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాప్ స్వర్ణోత్సవాలను అధికారులు బుధవారం నిర్వహించారు. వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో నాణ్యమైన వ్యాగన్ల తయారీ, మౌలిక వసతుల అభివృద్ధి పనితీరును ఆయన అభినందించారు. వ్యాగన్ పెయింటింగ్, స్ప్రింగ్ మెయింటెనెన్స్, సీఎన్‌సీ సర్ఫేస్ వీల్ లాత్ వంటి కీలక వ్యాగన్ సేవలను ఆయన ప్రారంభించారు.
News March 19, 2026
ఉగాదికి HYD కుర్రాళ్ల మోడ్రన్ కిక్కు!

ఈసారి సిటీ కుర్రాళ్ల ఉగాది వైబ్స్ మామూలుగా లేవు బాసూ! యంగ్ జనరేషన్ పాత పద్ధతులకు క్రేజీ ట్విస్ట్ ఇస్తోంది. అల్మారాలోని పాత దుస్తులకు మోడరన్ కట్స్ ఇస్తూ సస్టైనబుల్ ఫ్యాషన్ అంటూ ఇన్‌స్టా రీల్స్‌లో షార్ట్& స్వీట్‌గా రాశిఫలాలు చూసేస్తున్నారు. పార్కుల్లో యోగా సెషన్స్‌తో హెల్తీగా కొత్త ఏడాదిని స్వాగతించనున్నారు. పచ్చడి రుచులతో ట్రెడీషన్ ప్లస్ ట్రెండ్.. ఇదీ మనోళ్ల ఉగాది పసంద్! మీ ఉగాది ప్లాన్ ఏంటి?


