News December 1, 2025
కృష్ణా: పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో SEP 2025లో నిర్వహించిన BA.LLB 2,6వ సెమిస్టర్ (2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు DEC 8లోపు ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/ చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News March 8, 2026
VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News March 8, 2026
ఏలూరు: ఆక్రమణలో నర్సరీ భూములు (1/1)

పెదవేగి మండలం విజయరాయిలోని జిల్లా నర్సరీ కార్యాలయానికి చెందిన విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ నర్సరీని అభివృద్ధి చేయాల్సి ఉండగా, కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే పెంపకాన్ని పరిమితం చేశారు. పర్యవేక్షణ కొరవడటంతో సాగు చేయకుండా వదిలేసిన మిగిలిన 8 ఎకరాల భూమి క్రమంగా అన్యాక్రాంతం అవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News March 8, 2026
ఏలూరు: పర్యవేక్షణ కరవు.. ప్రభుత్వ భూమిలో అక్రమ సాగు (2/2)

ఏలూరు జిల్లాలో మల్బరీ విస్తరణ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సుమారు 8 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన కొందరు, అందులో యథేచ్ఛగా మొక్కజొన్న సాగు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. కనీసం ఈ భూములను లీజుకు ఇచ్చినా ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో ఆదాయం సమకూరేది. ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ఈ ఆస్తులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.


