News December 1, 2025

అల్లూరి జిల్లాలో ఈనెల 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష

image

ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పాఠశాల లాగిన్, మనమిత్ర వాట్సాప్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News March 8, 2026

MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

image

కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.

News March 8, 2026

సూర్యాపేట: షూటింగ్ బాల్‌లో శిరీష సత్తా

image

అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీష క్రీడారంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. షూటింగ్ బాల్ క్రీడలో 2024 ఆసియా పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి స్వర్ణ పతకం, 2026లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 8 పతకాలు గెలుచుకున్న ఈమె, గ్రామీణ ప్రాంత మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.

News March 8, 2026

రామప్పలోని ఉపాలయాలకు జాతీయ హోదా

image

ఓరుగల్లులోని చారిత్రక రామప్ప ఉపాలయాలు శివ తారకేశ్వర స్వామి ఆలయం, గొల్లాల ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించేందుకు భారత పురావస్తు శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు ఆలయాలు కాకతీయుల అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనాలు. ఈ నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే రెండు నెలల లోపు ఢిల్లీలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) డైరెక్టర్ జనరల్‌ చిరునామాకు రాసి పంపాలి.