News December 1, 2025

పాలమూరు: రక్తపింజర పాముతో జాగ్రత్త

image

రక్తపింజర పాము విషం రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేసి, కరిచిన భాగం వాచిపోతుందని, తక్షణ చికిత్స తీసుకోకపోతే రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయం ఉంటుందని స్నేక్ క్యాచర్ సదాశివయ్య హెచ్చరించారు. ప్రజలందరూ ఈ పాము పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 9963536233 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Similar News

News March 19, 2026

సంగారెడ్డి: ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

తెలంగాణ ప్రజలందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం అనుకూలించి సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలు బాగా పండుతూ రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాక్షించారు.

News March 19, 2026

పాలమూరు నేలకు కేంద్రం జలసంజీవని..!

image

నిరంతరం కరువు పరిస్థితులు ఎదుర్కొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన మండలాల్లో నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం రూ.100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, తొలి విడతగా రూ.50 కోట్లు విడుదలయ్యాయి. రైతు భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం .

News March 19, 2026

శ్రీశైలం: ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు

image

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మరో కర్ణాటక, మహారాష్ట్రను తలపిస్తోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో చూసినe కన్నడ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. తమ పుట్టింటి ఆడపడుచుకు సారే సమర్పించేందుకు కన్నడిగులు శ్రీశైలం తరలివచ్చారు. తొలి తెలుగు సంవత్సరం ప్రారంభం ఉగాది పర్వదినాన స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1,03,655 మంది భక్తులు దర్శించుకున్నారు.