News December 1, 2025

అమరావతికి మహర్దశ..16,666 ఎకరాల్లో మెగా ప్లాన్.!

image

రాజధాని అమరావతి దశ తిరగనుంది. ఏకంగా 16,666 ఎకరాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అమరావతిని నెక్ట్స్ జనరేషన్ గ్రోత్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ’, కొత్త రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. కనెక్టివిటీ, క్రీడలు, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేస్తూ, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ఈ ప్లాన్ లక్ష్యం.

Similar News

News March 14, 2026

తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

image

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.

News March 14, 2026

KU: అధ్యాపకుడి నుంచి ఉప కులపతి వరకు!

image

ఆచార్య ఎన్.లింగమూర్తి 1981లో సీకేఎం కళాశాల నుంచి <<19382315>>కేయూలో <<>>ఎకనామిక్స్ అధ్యాపకుడిగా చేరారు. పలు హోదాల్లో పదోన్నతులు పొంది సేవలందించారు. అదే కాకతీయ విశ్వవిద్యాలయంలో 2007లో ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నారు. 2013లో పదవీ విరమణ పొందారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన అజాతశత్రువు కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల మాజీ రిజిస్ట్రార్ సదానందం, కేయూ అధ్యాపకులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.

News March 14, 2026

FLASH.. కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

image

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.