News December 1, 2025
మేడారంపై గొంతు విప్పుతారా..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి WGL నుంచి కడియం కావ్య, బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే 2 నెలల్లో జరగనుంది. ఇప్పటికే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర నిధులను కేటాయించింది. మరో పక్క కేంద్రం మేడారంను జాతీయ పండగగా మార్చేందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఈ సీజన్లో గొంతు విప్పి అడిగి ఎండగడితే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
Similar News
News March 21, 2026
‘ధురంధర్’.. హీరో రెమ్యునరేషన్ ఎంతంటే?

ధురంధర్ సినిమా రెండు పార్టులకు కలిపి దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో రణ్‌వీర్ సింగ్ రూ.50 కోట్లు, సంజయ్ దత్ రూ.10 కోట్లు, మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ రూ.కోటి, సారా అర్జున్ రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్ట్-1 రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్-2 అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.
News March 21, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల కలకలం

మంగళగిరి AIIMSలో లైంగిక వేధింపుల కలకలం రేపుతున్నాయి. సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనాచారి వేధింపులు భరించలేక ఓ మహిళా సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భర్త చనిపోవడంతో ఓ మహిళ AIIMSలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుందని, ఈ క్రమంలో మోహనాచారి రాత్రి వేళల్లో ఫోన్‌లు చేసి వేధిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
News March 21, 2026
గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉత్తరాంధ్ర : రామ్మోహన్

విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ తన బలాన్ని ప్రపంచానికి చూపిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం విశాఖ నోవాటెల్ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫ్‌రెన్స్‌కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర గ్లోబల్ డెష్టినేషన్‌గా రూపుదిద్దుకొంటోందని అన్నారు.


