News December 1, 2025

కేఎంటీపీలోకి అమెరికా పత్తి బేళ్లు ప్రవేశం!

image

WGL కేఎంటీపీ వస్త్ర పరిశ్రమలకు అమెరికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే 13 కంటెయినర్లు రాగా, త్వరలో మరో 15 కంటెయినర్లు రానున్నాయి. ఇటీవల ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేయడంతో విదేశీ బేళ్లు దేశీయ బేళ్లకంటే చౌకగా మారాయి. కైటెక్స్, యంగ్వన్ వంటి కంపెనీలు విదేశీ బేళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. సీసీఐ ద్వారా రాష్ట్రంలోనే సరిపడా బేళ్లు లభిస్తున్నా, విదేశాలవి రావడంపై ఆగ్రహంగా ఉన్నారు.

Similar News

News April 2, 2026

కొవ్వూరు: గోదావరి ఒడ్డున మహిళ మృతదేహం లభ్యం

image

కొవ్వూరు సమీప గోదావరి ఒడ్డున కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన చెరుకూరి సూర్యచక్ర(30) మృతదేహం లభ్యమైంది. గత నెల 21న ఇద్దరు కుమార్తెలతో కలిసి గౌరీపట్టణం మేరీ మాత ఉత్సవాలకు వచ్చిన ఈమె, తిరిగి ఇంటికి చేరలేదు. బుధవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, ఆమెతో ఉన్న ఇద్దరు పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2026

చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

image

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

News April 2, 2026

కృష్ణా: పెరిగిన పాల ధరలు.. ఎంతంటే..!

image

ఇప్పటికే ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై పాల ధరలు భారమయ్యాయి. లీటరు పాలపై రూ.2 చొప్పున ధర పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.