News December 1, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయం కిక్కిరిసింది.

Similar News

News March 19, 2026

కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

image

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్‌పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>

News March 19, 2026

రంజాన్ ఎల్లుండే..

image

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

News March 19, 2026

జిల్లాలో ఘనంగా ఉగాది.. ఊరూరా పంచాంగ శ్రవణాలు

image

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన జిల్లాలోని గ్రామగ్రామాన పంచాంగ శ్రవణాల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాదిలో జరగబోయే మంచి చెడులను పూజారులు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు హాజరయ్యారు.