News December 1, 2025

మంచిర్యాల: 9వ తరగతి విద్యార్థి మృతి

image

జైపూర్ మం. ఎల్కంటిలో విషాదం నెలకొంది. రెడ్డి జాగృతి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి (9వ తరగతి) చికిత్స పొందుతూ మరణించాడు. వరంగల్‌లోని ఓ స్కూల్‌లో చదువుతున్న భరత్‌రెడ్డికి ఇటీవల జరిగిన పోటీల్లో పాల్గొనగా చేతికి గాయమైంది. శనివారం MNCL ఆసుపత్రికి తీసుకురాగా, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించి KNR కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి HYD తరలించే క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Similar News

News March 17, 2026

బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

image

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.

News March 17, 2026

NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

image

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.