News December 1, 2025
నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త హాల్‌లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరగనుంది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీడీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, శానిటేషన్, వరద ముంపు ప్రదేశాల గుర్తింపు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల పెంపు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అయితే గత సమావేశాల్లోలా ఈసారి కూడా చర్చ పేరుతో 2 గంటల్లోనే మీటింగ్ ముగిసిపోతుందనే అనుమానాలు ఉన్నాయి.
Similar News
News March 13, 2026
వివాదాస్పద ఖర్చుల చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్(2/2)

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం రాళ్లు తరలింపు, యోగాంధ్ర కార్యక్రమంలో వినియోగించిన వీఐపీ మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు జీవీఎంసీ సమావేశంలో అంగీకరించారు. కూర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే పార్కుకు నీటి సరఫరా పైపులకు రూ.46.60 లక్షలు, ట్యాంకర్ల బిల్లులకు రూ.19.20 లక్షలు, ఫాగింగ్‌కు రూ.80 లక్షలు, వీధి కుక్కల శస్త్రచికిత్సలకు రూ.45 లక్షల చెల్లించెందుకు ఆమోదం తెలిపారు.
News March 13, 2026
జీవీఎంసీ చివరి సమావేశం.. వివాదస్పద నిర్ణయాలకు ఆమోదం(1/2)

జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన అజెండాలోని 193 అంశాలతో పాటు టేబుల్ అజెండా కలిపి మొత్తం 294 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 293 అంశాలను సభ్యులు ఆమోదించారు. గతంలో వివాదాస్పదంగా మారి వాయిదా పడిన ప్రతిపాదనలకూ స్వల్ప చర్చతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు రోజుల్లో పాలకవర్గ గడువు ముగియనున్న నేపథ్యంలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలనూ అడ్డుకోకుండా ఆమోదించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 13, 2026
NZB: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి’

బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (SRI)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి VC నిర్వహించారు.


