News December 1, 2025
కృష్ణా: పార్లమెంట్‌లో గర్జించి.. సమస్యలు పరిష్కరించండి సార్.!

విజయవాడ మెట్రో, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కేంద్రం అనుమతులు, నిధులు అత్యవసరం. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, అమృత్, జల్ జీవన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. కృష్ణా నదిపై చౌడవరం, మోపిదేవి వద్ద రెండు బ్యారేజీలు, బుడమేరు శాశ్వత పరిష్కారానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలి. ఈ సమస్యలపై ఎంపీలు చిన్ని, బాలశౌరి పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 12, 2026
శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.
News March 12, 2026
ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.
News March 12, 2026
HYD: జనాభా గణనపై BIG UPDATE

జనాభా గణన- 2027ను గ్రేటర్ వ్యాప్తంగా పకడ్బందీగా చేపట్టి, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. GHMC హెడ్ ఆఫీస్‌లో సెన్సెస్ సర్వేపై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు 3 రోజుల శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. సర్వే 2 దశల్లో జరుగుతుందని మొదటి దశలో గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు.


