News December 1, 2025

అల్లూరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బంద్.. కానరాని ప్రభావం

image

మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఆదివారం మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొయ్యూరు, జీకేవీధి, సీలేరు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రపాలెం వారపు సంత యథావిధిగా జరిగింది. పలుచోట్ల దుకాణాలు పనిచేశాయి.ప్రైవేటు వాహనాలు తిరిగాయి. బంద్ ప్రభావం కానరాలేదు.

Similar News

News March 28, 2026

నాగార్జునసాగర్ తీరంలో అంతర్జాతీయ సదస్సు!

image

నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు శనివారం సందర్శించనున్నారు. బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వీరు ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని అధికారుల సమాచారం. ఈ సందర్శన బౌద్ధ సాంస్కృతిక పరస్పర మార్పిడి, ప్రచారం, పరిశోధనలకు కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

News March 28, 2026

పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 28, 2026

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా: వైసీపీ

image

మంత్రి మండిపల్లి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న రాయచోటి కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా చెప్పులు వేసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?, చంద్రబాబు చెప్పులతో పూజలు చేయగా లేనిది మంత్రి చెప్పులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తే తప్పేమిటి అనుకున్నాడో ఏంటో’ అని వైసీపీ రీట్వీట్ చేసింది.