News April 18, 2024
ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన తోషిబా

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోషిబా ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. జపాన్‌లోని తమ సంస్థలో సుమారు 5వేల మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీలో డిజిటల్ టెక్నాలజీ, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టనుంది. అందుకు కంపెనీపై 650 మిలియన్ డాలర్ల ఖర్చు కానుంది. జపాన్‌లో అత్యధిక ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఒకటైన తోషిబా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Similar News
News January 26, 2026
జెండా ఆవిష్కరణ.. ఈ తేడాలు తెలుసా?

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT
News January 26, 2026
బన్నీతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

LCUని పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమవడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్ & బన్నీతో చాలాకాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. ఇది పూర్తయ్యాక ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్ సినిమాలుంటాయి. రెమ్యునరేషన్ కారణంగా ఖైదీ-2 నుంచి వైదొలిగాననేది అవాస్తవం’ అని లోకేశ్ వెల్లడించారు.
News January 26, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

బారక్‌పోర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


