News December 1, 2025
కాక రేపుతున్న నరసరావుపేట రాజకీయాలు.!

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు పట్టణంలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో 90 సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, నరసరావుపేటను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాసు ఘాటగా స్పందించారు.
Similar News
News March 20, 2026
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ డిజైన్లపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మెటీరియల్‌తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
News March 20, 2026
పాక్-అఫ్గాన్.. సోదరుల్లా ఉండండి: ఖమేనీ

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సోదరుల్లా ఉండాలి. మంచి సంబంధాలు ఏర్పర్చుకోండి. ముస్లింల మధ్య విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ఖమేనీ చెప్పినట్లు తెలుస్తోంది.
News March 20, 2026
లక్ష్యాలను అధిగమించండి: అన్నమయ్య కలెక్టర్

రెవెన్యూ శాఖ తమ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలోని కలెక్టరేట్ ఆయన సమీక్షించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల సేవల వినియోగంపై జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.


