News December 1, 2025
ఖమ్మం: ఒకే ఊరు.. రెండు పంచాయతీలు

కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా (ఈశ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు) విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన వల్ల ప్రజలకు పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి.
Similar News
News April 6, 2026
నీటి భద్రతే లక్ష్యం: సీఎం చంద్రబాబు

100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో నీటిని సంరక్షిస్తామని యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో CM చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో గతంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి హార్టికల్చర్ హబ్‍గా మార్చామని గుర్తుచేశారు. భూగర్భజలాలు 1.92 మీటర్లు పెరిగాయని, మైక్రో ఇరిగేషన్ అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News April 6, 2026
మండపేట: కాలువలో పడ్డ కారు.. దంపతులు మృతి

మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. రూరల్ CI దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బోగిల్లి వీర వెంకట సతీశ్ (40), ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి (36) నీటిలో మునిగి మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 6, 2026
MBNR: ఉపాధి కార్యాలయంలో కెరీర్ గైడెన్స్: రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం & నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8, 9న శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి ఉన్నవాళ్లు https://forms.gle /a7ComMvBg6wmPXhT9 వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.


