News December 1, 2025
విశాఖ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతారా?

నేటి నుంచి పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి ముగ్గురు MPలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అపోహలు తొగించేలా ప్రకటన, రైల్వే జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్, రాజమహేంద్రవరం-అనకాపల్లి నేషనల్ హైవేకి నిధులు, అనకాపల్లిలోని పలు స్టేషన్‌లలో రైళ్లకు హాల్ట్, గిరిజనుల హక్కుల పరిరక్షణపై గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 16, 2026
నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.
News March 16, 2026
రాజవొమ్మంగి: పరీక్ష టెన్షన్.. తెలుగు టీచర్‌కు ప్రమాదం

రాజవొమ్మంగిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఆ ఒత్తిడిలో పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు డి. శ్రీదేవి ప్రమాదానికి గురయ్యారు. రాజవొమ్మంగి ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న ఆమె, సోమవారం ఉదయం స్కూల్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె చేయి, కాలుకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను రాజవొమ్మంగి PHCకి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
News March 16, 2026
సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.


