News December 1, 2025
భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.
Similar News
News March 19, 2026
మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఉ.గోదావరి, గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. రాత్రి నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
News March 19, 2026
కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ

తెలుగు ప్రజలకు PM మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ కొత్త శక్తికి, ఆరంభాలకు ప్రతీక అని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని AP CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘షడ్రుచులతో జీవన తత్వాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది’ అంటూ TG CM రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ప్రజలకు విషెస్ చెప్పారు.
News March 19, 2026
IPL పేరుపై వివాదం.. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పేరును BCCI ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను కేరళ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. IPL అధికారిక నేషనల్ టోర్నమెంట్ కాదని, అందువల్ల ‘ఇండియన్’ పదాన్ని వాడొద్దని పిటిషనర్ అషిక్ కరోత్ వాదించారు. కొన్నేళ్లుగా IPL జరుగుతున్నప్పటికీ ‘ఇండియన్’ పదం గురించి పిటిషనర్ ఆలస్యంగా గ్రహించారని, ఇది కోర్టు పరిధిలోకి రాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.


