News December 1, 2025

జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్‌ని తెచ్చారు: కోటంరెడ్డి

image

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.

Similar News

News March 7, 2026

నెల్లూరులో 9న ‘మహిళా జన సున్వాయి’

image

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

News March 6, 2026

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ నెల్లూరు జిల్లాలో అవగాహన

image

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.