News December 1, 2025

అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.

Similar News

News March 18, 2026

HYD: ‘అగ్నివీర్‌’లో దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ నియామకాలకు అర్హులైన యువత <>joinindianarmy.nic.in<<>>లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ సికింద్రాబాద్ కల్నల్ సునీల్ యాదవ్ తెలిపారు. పదిహేడున్నర నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్ పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మన్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయని, దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 1, 2026 అని వెల్లడించారు.

News March 18, 2026

భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా: మంత్రి పొన్నం

image

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఫైరయ్యారు. ‘BJP నుంచి 8 మంది MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు? రావాల్సిన నిధులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. భారత్‌లో TG అంతర్భాగం కాదా? నిధులు ఎందుకు కేటాయించరు? రాష్ట్ర ఏర్పాటు విషయంలో తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని BJP కేంద్ర నేతలు అంటే రాష్ట్ర నేతలు ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.

News March 18, 2026

ఇంటికే గ్యాస్.. ఏజెన్సీల వద్ద వేచి ఉండొద్దు: కేంద్రం

image

గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఏజెన్సీల వద్దకు వెళ్లొద్దని, సిలిండర్లను నేరుగా ఇంటికే పంపిణీ చేస్తామని వెల్లడించింది. IVRS, వాట్సాప్, మొబైల్ యాప్, <<19379922>>మిస్డ్‌కాల్<<>>, UPI యాప్స్‌ల ద్వారా బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.